నస్రల్లా హత్య న్యాయమైన చర్యే: బైడెన్‌

గత ఏడాది మొదలైన యుద్ధం ఆరంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్‌ మొదలైందన్న అమెరికా అధ్యక్షుడు

Advertisement
Update:2024-09-29 08:38 IST

హెజ్‌బొల్లా లక్ష్యంగా బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ క్రమంలోనే హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించిన విషయం విదితమే. దీనిపై హెజ్‌బొల్లా కూడా స్పందించింది. ఈ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో నస్రల్లా హత్యపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. నస్రల్లా హత్యను న్యాయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాది మొదలైన యుద్ధం ఆరంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్‌ మొదలైందని బైడెన్‌ వెల్లడించార. హెజ్‌బొల్లా, హమాస్‌ వంటి ఇరానియన్‌ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును ఆయన ఈ సందర్బంగా పునరుద్ఘాటించారు. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్‌బొల్లాలో వేలాదిమంది అమెరికన్లు మృతి చెందారని బైడెన్‌ తెలిపారు. విపక్షాల దూకుడును ఆరికట్టి, యుద్ధ ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్య ప్రాచ్య ప్రాంతంలో యూఎస్‌ సైనిక దళాల రక్షణను మరింత మెరుగుపరచాలని రక్షణ కార్యదర్శిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీరుట్‌లో నెలకొన్నభద్రతా పరిస్థితుల దృష్ట్యా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ కోరింది.

హెజ్‌బొల్లా కమాండర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని క్షిపణి యూనిట్‌ కమాండర్‌ మహమ్మద్‌ కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ఉ ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు హతమార్చాయి. అతని డిప్యూటీ, పలువురు హెజ్‌బొల్లా కమాండర్లు, ఉగ్రవాదులు చనిపోయారని టెలిగ్రామ్‌లో ప్రకటించింది. లెబనాన్‌లోని బెకా లోయలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తున్నది. ఈ క్రమంలోనే హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా, ఆయన కుమార్తె జైనబ్‌ మృతి చెందిన విషయం విదితమే.

Tags:    
Advertisement

Similar News