కమలా హారిస్ కీలక ప్రసంగం
స్వేచ్ఛతో కూడిన దేశం కావాలా? లేక విభజన, గందగోళంలో పాలించడం కావాలా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నదన్న కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కీలక ప్రసంగం చేశారు. ఇంకో వారంలో ప్రజలు తీరు సుకునే నిర్ణయం వారు, వారి కుటుంబాలు, దేశ భవిష్యత్తుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. అమెరికన్ ప్రజల జీవితాల్ని మార్చేసి ఓటు ఇది అని చెప్పారు. ఈ ఎన్నికలు ఇప్పటివరకు వచ్చిన వాటి కన్నా ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. స్వేచ్ఛ ఉండాలా? గందరగోళం, విభజన కావాలా నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈరోజు నుంచి వారం మాత్రమే ఉంది. మీతో పాటు ఈ దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన ఓటు. స్వేచ్ఛతో కూడిన దేశం కావాలా? లేక విభజన, గందగోళంలో పాలించడం కావాలా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నది అని కమలా హారిస్ పేర్కొన్నారు.నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నిక లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ అభ్యర్థి ఓటర్లకు చివరగా ఈ విధంగా విజ్ఞప్తి చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారా వ్యాప్తిలో 'ఎక్స్' పాత్ర!
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ తాము రూ. వేలల్లో సంపాదిస్తున్నామని ఎక్స్ యూజర్లు పేర్కొన్నారు. ఏఐ ఇమేజ్‌లు, కుట్ర సిద్ధాంతాలను ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నందుకుక వారికి డాలర్లు ముడుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ట్రంప్, కమలాహారిస్ మద్దతుదారుల నుంచి ఆ మొత్తం అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమాచారాన్ని కొందరు యూజర్లు తరచూ మార్పిడి చేసుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.