కమలా హ్యారిస్.. నెక్ట్స్ ఏమిటీ?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో పోటీ పడి ఓడిపోయిన కమలా హ్యారిస్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే చర్చ అప్పుడే మొదలైంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకొన్ని ఎన్నికల్లో పోటీ చేస్తారా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హ్యారిస్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదలు పెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. మరో 72 రోజుల్లో ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కాలిఫోర్నియా సెనేట్ కు ఆమె ప్రాతినిథ్యం వహిస్తారా అంటే సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుందని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చిన వాళ్లు సైతం కమల నాయకత్వంపై అసంతృప్తి ప్రదర్శిస్తున్నారు. కమల ఏం చేయబోతున్నారు అన్నది వచ్చే ఏడాది జనవరి 20 తర్వాత తేలిపోనుంది.