ఉత్తర గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

ఈ దాడుల్లో దాదాపు 45 మంది మృతి చెందినట్లు సమాచారం

Advertisement
Update:2024-10-27 09:46 IST

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. తాజాగా ఇజ్రాయెల్‌ దళాలు ఉత్తర గాజాపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 45 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాలో ఆరు భవనాలపై ఇజ్రాయెల్‌ దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 35 మంది మరణించారు. అలాగే ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది మృతి చెందగా.. అనేకమంది గాయపడినట్లు సమాచారం. తాజా దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్‌ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. ఈ దాడులను ఐడీఎఫ్‌ కూడా ధృవీకరించింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించింది.

ఈ దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. 'ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కఠినమైన సవాల్‌. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దారుణం' అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. మరోవైపు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాల్లో రెండు భవననాలను ఖాళీ చేయాలని లెబనాన్‌ నివాసితులకు ఇజ్రాయెల్‌ దళాలు సూచించాయి. ఆ ప్రాంతం లక్ష్యంగా వైమానిక దాడులు చేయనున్నట్లు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News