హెజ్‌బొల్లాతో కాల్పులకు విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే

హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన జో బైడెన్‌

Advertisement
Update:2024-11-27 08:40 IST

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నది. హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అద్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు.'గుడ్‌ న్యూస్‌. నేను ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్‌-హెజ్‌బొల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం అని బైడెన్‌ రాసుకొచ్చారు.

మరోవైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్నిరోజులు ఉంటుందనేది లెబనాన్‌పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 'మేం ఒప్పందాన్ని అమలు చేస్తాం. కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తాం. విజయం సాధించేవరకు మేం ఐక్యంగా పోరాడుతాం' అని నెతన్యాహు వెల్లడించారు. 

Tags:    
Advertisement

Similar News