ఆవేశంలో 12 మంది బంధువులను చంపి..

ఇరాన్ అధికారిక మీడియా ఇచ్చిన సమాచారం ప్రాకారం సుమారు 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మందిని కాల్చి చంపాడు.

Advertisement
Update:2024-02-17 19:33 IST

ఇరాన్‌లో ఓ వ్యక్తి మారణహోమానికి తెరతీశాడు. ఆవేశంలో విచాక్షణారహితంగా తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ సెంట్రల్ ప్రావిన్స్ లోని ఓ మారమూల గ్రామంలో జరిగిన ఈ దాడికి కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.

ఇరాన్ అధికారిక మీడియా ఇచ్చిన సమాచారం ప్రాకారం సుమారు 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మందిని కాల్చి చంపాడు. వీరందరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. బాధితుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.

విషయం తెలిసిన వెంటనే రంగంలోకి ద్రగిన ఇరాన్‌లోని భద్రతా బలగాలు దక్షిణ-మధ్య ప్రావిన్స్ కెర్మాన్‌లో నిందితుడ్ని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇరాన్‌లో సామూహిక హత్యలు చాలా అరుదు. అలాగే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో హంటింగ్ రైఫిల్స్ మాత్రమే దగ్గర ఉంచుకునేందుకు అనుమతి ఉంది. అయితే దాడి చేసిన వ్యక్తి కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్‌ను ఉపయోగించినట్లు పేర్కొంది.

రెండేళ్ల క్రితం పశ్చిమ ఇరాన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రభుత్వ సంస్థ నుంచి తొలగించబడిన ఓ ఉద్యోగి ముగ్గురిని కాల్చి చంపాడు. మరో 5 గురిని గాయపరచాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2016లో దక్షిణ ఇరాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో 26 ఏళ్ల యువకుడు తన బంధువుల్లో పది మందిపై కాల్పులు జరిపాడు.

ఇటీవల కాలంలో ఇరాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తో పాటూ అమెరికా ఆంక్షలు, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల వల్లే దేశంలో హింస పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తంఅవుతోంది.

Tags:    
Advertisement

Similar News