ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడి

దాడిని ముగించామన్న ఇరాన్‌... భారీ తప్పిదాలకు పాల్పడిందని తగిన మూల్యం చెల్లించుకుంటున్నదని ఇజ్రాయెల్‌ హెచ్చరిక

Advertisement
Update:2024-10-02 08:45 IST

పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రికత్త పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి .హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్‌ కూడా రంగంలోకి దిగింది. క్షిపణులతో ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ ప్రత్యక్ష దాడికి దిగింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమ దేశ పౌరులను అప్రమత్తం చేసి దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగింది. ఇరాన్‌ 400పైగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. టెల్‌ అవీన్‌, జెరూసలేం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై ఇరు దేశాలు స్పందించాయి. శాంతిభద్రతల లక్ష్యంతోనే దాడులు ప్రారంభించామని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్‌కియాన్‌ తెలిపారు. ఇరాన్‌ యుద్ధానికి పాల్పడే దేశం కాదని నెతన్యాహుకు తెలుపండని వ్యాఖ్యానించిన ఆయన.. తమ దేశంతో ఘర్షణకు దిగవద్దని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌ క్షిపణులతో విచురుచుకుపడటంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కూడా స్పందించారు. ఇరాన్‌ భారీ తప్పిదాలకు పాల్పడిందని తగి న మూల్యం చెల్లించుకుంటున్నదన్నారు. జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరాన్‌ చర్యలపై ధ్వజమెత్తారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్‌ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇజ్రాయెల్‌పై మా దాడిని ముగించాం

ఇజ్రాయెల్‌పై క్షిపణుల ప్రయోగం తర్వాత ఇరాన్‌ స్పందించింది. చనిపోయిన హమాస్‌ అధినేత ఇస్మాయెల్‌ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా, నిల్పోరూషన్‌ మరణనానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇజ్రాయెల్‌పై మా దాడిని ముగించామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరకి చెప్పారు. ఇజ్రాయెల్‌ మరింత ప్రతీకారానికి పాల్పడితే తప్ప స్పందించమన్నారు. ఆ సందర్భంలో మా స్పందన మరింత శక్తిమంతంగా, తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా, ఇజ్రాయెల్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్‌ నుంచి తాజాగా ప్రకటన వెలువడింది.

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: గాలెంట్‌

దాడులపై స్పందించిన ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గాలెంట్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.కమాండ్‌కంట్రోల్‌ నుంచి రక్షణ శాఖ అధికారులతో కలిసి ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన ఇరాన్‌ క్షిపణులను అడ్డుకునే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఇరాన్‌ ఒక చిన్న పాఠం కూడా నేర్చుకోలేదన్నారు. ఇజ్రాయెల్‌ ఎవరు దాడి చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఈ మేరకు పోస్ట్ పెట్టారు.మరోవైపు ఈ దాడితో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఐరన్‌ డోమ్‌ వంటి టెక్నాలజీతో క్షిపణులు దీటుగా ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఇరాన్‌ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సైరన్లు మోగిన తర్వాత ఆకాశంలో పేలుళ్లు జరుగుతున్న తీరుపై నెటిజన్లు పోస్టులు పెట్టారు. జోర్డాన్‌ ఉపరితలంపై క్షిపణలు పడిపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. దాడుల నేపథ్యంలో జోర్డాన్‌ అధికారులు విమాన రాకపోకలను నిలిపివేశారు.

బైడెన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందింది: రష్యా

మధ్య ప్రాచ్యంలో బైడెన్‌ అనుసరిస్తున్న విధానం సంపూర్ణంగా విఫలమైందని రష్యా విమర్శించింది. వైట్‌హౌస్‌ ప్రకటనలకే పరిమితమై నిస్సహాయతను ప్రదర్శిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నదని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.

Tags:    
Advertisement

Similar News