గ్రీన్ కార్డ్ పిటిష‌న్ల‌లో భార‌తీయుల‌కు ప్రాధాన్య‌మివ్వాలి.. - బైడెన్‌కు 56 మంది శాస‌న‌క‌ర్త‌ల లేఖ‌

ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఆ లేఖ‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement
Update:2023-07-30 08:24 IST

గ్రీన్ కార్డ్‌.. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పిస్తూ మంజూరు చేసే గుర్తింపుకార్డు ఇది. ఈ గ్రీన్ కార్డ్ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌వారి సంఖ్య భారీగా పెరిగిపోతుండ‌గా.. కోటా విధానం వ‌ల్ల వాటి మంజూరులో తీవ్ర జాప్యం ఎదుర‌వుతుంది. ఆ కార్డు కోసం అనేక మంది భార‌తీయ ద‌ర‌ఖాస్తుదారులు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సిన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయుల నుంచి వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌కు ప్రాధాన్య‌మిచ్చి ప‌రిష్క‌రించాల‌ని అమెరికా కాంగ్రెస్ స‌భ్యులు తాజాగా అధ్య‌క్షుడు జో బైడెన్‌ను కోరారు. ఈ మేర‌కు రాజా కృష్ణమూర్తి, లేరీ బుల్షన్ నేతృత్వంలో 56 మంది శాసనకర్తలు జో బైడెన్ సర్కారుకు లేఖ రాశారు.

ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఆ లేఖ‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల దరఖాస్తుదారుల్లో నిరంతర అనిశ్చితి కనిపిస్తోందన్నారు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ ప్రాతిపదికన ఇచ్చే వీసాల విషయంలో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లి ఉపశమనం కల్పించాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను, ఇంట‌ర్న‌ల్ సెక్యూరిటీ వింగ్‌ని వారు కోరారు.

చట్టబద్ధంగా అమెరికాకు రావాలనుకుంటున్నవారికి ఊరట ఇవ్వాలని శాస‌న‌క‌ర్త‌లు త‌మ లేఖ‌లో పేర్కొన్నారు. చట్టబద్ధ వలస వ్యవస్థలో అధికార యంత్రాంగం అలసత్వం వల్ల వీసాలు పెండింగులో పడిపోయి.. ఉద్యోగాలు మారాలనుకున్నవారికి, వ్యాపారాలు ప్రారంభించేవారికి, అపరాధ రుసుం లేకుండా విదేశాలకు ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.


కోటా విధానంతోనే ఇబ్బందులు

'ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్' (ఎఫ్ఎస్ఐఐడీఎస్ యూఎస్ఏ) కూడా ఇప్ప‌టికే జో బైడెన్‌కు ఈ స‌మ‌స్య‌పై విజ్ఞప్తి చేసింది. దేశాలవారీగా గరిష్ఠంగా ఏడు శాతం కోటాను అమలు చేస్తున్న విధానం వల్ల భారత్ వంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివ‌రించింది. దీనివ‌ల్ల దశాబ్దాలపాటు ఎదురుచూపులు తప్పడం లేదని తెలిపింది. గ్రీన్‌కార్డ్ రాక‌పోవ‌డం వ‌ల్ల యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారని 'ఇమ్మిగ్రేషన్ వాయిస్' అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags:    
Advertisement

Similar News