ఆ దేశానికి సాయం చేశారో.. తీవ్ర పరిణామాలుంటాయ్‌

అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Advertisement
Update:2024-10-12 16:27 IST

అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇజ్రాయిల్‌ - ఇరాన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయిల్‌ కు నేరుగా లేదా పరోక్షంగా సాయం చేసినట్టయితే అది ప్రత్యక్షంగా తమ దేశంపై దాడి చేసినట్టే భావించాల్సి వస్తుందని.. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ - ఇరాన్‌ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా బాహాటంగానే ఇజ్రాయిల్‌ కు సాయం చేస్తోంది. హోజ్‌ బొల్లా కీలక నేతలను హతమార్చడం వెనుక అగ్రరాజ్యం సాయం ఉందని ఇరాన్‌ అనుమానిస్తుంది. మొదట ఇజ్రాయిల్‌ - హోజ్‌ బొల్లా మధ్య యుద్ధంగానే కనిపించినా ఇరాన్‌ ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగింది. తమ దేశంపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ పై ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌ కు మద్దతుగా అమెరికా ఇరాన్‌ ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News