పాక్ ను వీడి వెళ్లను.. తుది శ్వాస వరకు ఈ గడ్డమీదనే ఉంటా
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
Advertisement
తుది శ్వాస వరకు పాక్ గడ్డమీదనే ఉంటానని.. దేశం విడిచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు. 'ఎక్స్'లో ఆయన పోస్ట్ పెట్టారు. తాను జైలులో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు దేశం విడిచి వెళ్లాలని సూచించారని.. కానీ తాను అందుకు నిరాకరించి జైళ్లోనే ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు సంబంధించిన నిర్ణయాలు ఏవైనా ఇక్కడే తీసుకోవాలని.. ఎక్కడి నుంచో ఎవరో తీసుకోవడం దేశానికి మంచిది కాదన్నారు. ముషారఫ్ పాలనలోనూ ఇంతటి అణచివేత లేదని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏడాది కాలంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ లోని అడియాల జైలులో ఖైదీగా ఉన్నారు.
Advertisement