తమను భారత్ లో కలపాలంటూ పీఓకేలో భారీ ఆందోళనలు

తమ ప్రాంతం పట్ల పాక్ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్య్వహరిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లడఖ్ లో కలపాలంటూ పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు డిమాండ్ ఈ మధ్యకాలంలో ఊపందుకుంది.

Advertisement
Update:2023-01-13 11:43 IST

పాక్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో, ఆహారం దొరకక సతమవుతూ ఉంటే ఆ దేశ పాలకులకు మరో షాక్ తగిలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు తమను భారత్ లో కలపాలని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.

తమ ప్రాంతం పట్ల పాక్ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్య్వహరిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లడఖ్ లో కలపాలంటూ పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు డిమాండ్ ఈ మధ్యకాలంలో ఊపందుకుంది.

పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ, గోధుమ, ఇతర ఆహారోత్పత్తులపై సబ్సిడీలను పునరుద్ధరించాలని కోరుతూ వేలాది మంది ప్రజానీకం ర్యాలీలు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అస్థ‌వ్యస్తంగా ఉంది. పుండు మీద కారంలా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజల ఆందోళనలు పాక్ ప్రభుత్వానికి, ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరో వైపు గిల్గిట్ బాల్టిస్థాన్ సహా పీవోకే ఎప్పటి కైనా భారత్ దే నని, ఏనాటికైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని తీరుతామని, భారత హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు అనేక సార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా అదే డిమాండ్ ను వినిపిస్తుండటంతో పాక్ పాలకులకు ఏం చేయాలో అర్దం కావడంలేదు.


Tags:    
Advertisement

Similar News