అక్కడ తుపాకుల మోతకు, క్షిపణి దాడులకు తెరపడినట్టేనా?

హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ప్రతిపాదన.. ఇజ్రాయెల్‌ పీఎం అంగీకారం!

Advertisement
Update:2024-11-25 20:32 IST

హెజ్‌బొల్లా - ఇజ్రాయిల్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెజ్‌బొల్లా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ఓకే చెప్పినట్టుగా తెలిసింది. కాల్పుల విరమణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరు వర్గాలు చెప్తున్నాయి. అన్ని అంశాలపై చర్చల తర్వాతే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని, అప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు కానట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ అధికారులు చెప్తున్నారు. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో కాల్పుల మోత, క్షిపణ దాడులతో లెబనాన్‌, ఇజ్రాయెల్‌ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో 3,500 మంది లెబనాన్‌ పౌరులు మృతిచెందినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కొంత కాలంగా సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతుండటంతో 10 లక్షల మందికి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని లెబనాన్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో హెజ్‌బొల్లా పెద్ద ఎత్తున నష్టపోయింది.

Tags:    
Advertisement

Similar News