హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మృతి!

బీరుట్‌లో జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్‌ ధృవీకరణ

Advertisement
Update:2024-09-28 15:08 IST

హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ శుక్రవారం భీకరస్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీరుట్‌లో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మృతి చెందినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ధృవీకరించింది. ఈ మేరకు తమ 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్‌ చేసింది. కొన్నిరోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా కుమార్తె జైనబ్‌ మృతి చెందిన విషయం విదితమే. హెజ్‌బిల్లాను సమర్థిస్తూ.. తమ కుటుంబ త్యాగాలను జైనబ్‌ తరుచుగా ప్రస్తావించేదని సమాచారం.

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులు

హెజ్‌బొల్లా కమాండర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని క్షిపణి యూనిట్‌ కమాండర్‌ మహమ్మద్‌ కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ఉ ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు హతమార్చాయి. అతని డిప్యూటీ, పలువురు హెజ్‌బొల్లా కమాండర్లు, ఉగ్రవాదులు చనిపోయారని టెలిగ్రామ్‌లో ప్రకటించింది. లెబనాన్‌లోని బెకా లోయలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తున్నది. సిరియా సరిహద్దులోని ఈ స్థావరాల్లో అనేకమంది హెజ్‌బొల్లా ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది.

ఖమేనీ అత్యవసర సమావేశం

నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తున్న సమయంలోనే ఇరాన్‌ సుప్రీం ఖమేనీ జాతీయ భద్రతా మండలిని తన నివాసంలో అత్యవసరంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీరుట్‌పై దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లాతో కమ్యూనికేషన్‌ తెగిపోయినట్లు తెలిసింది. అతను బతికే ఉన్నాడని హెజ్‌బొల్లా వర్గాలు ఓ మీడియా సంస్థతో చెప్పాయి. టెహ్రాన్‌ అతని సమాచారం గురించి ఆరా తీస్తున్నదని ఇరాన్‌కు చెందిన ఓ సినియర్‌ అధికారు చెప్పారు.

దాడులపై మాకు సమాచారం లేదు: పెంటగాన్‌

బీరూట్‌లో ఇజ్రాయెల్‌ దాడులపై మాకు ముందస్తు సమాచారం లేదని అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. తాను ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రితో మాట్లాడేసరికే దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. నస్రల్లా మరణంపై తనకు పూర్తి సమాచారం లేదని లాయిడ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గాలెంట్‌తో మరోసారి ఆ విషయంపై మాట్లాడాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News