హైతీలో 72 గంటలపాటూ ఎమర్జెన్సీ విధింపు

హైతీలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. చెలరేగిపోయిన సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

Advertisement
Update:2024-03-04 21:40 IST

హైతీలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. చెలరేగిపోయిన సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీలో నేరగాళ్ల ముఠాలు పోర్ట్ అ ప్రిన్స్ జైలుపై దాడి చేసిన ఘటనలో ఏకంగా 4వేల మంది ఖైదీలు తప్పించుకున్నారు. దీంతో ప్ర‌భుత్వం 72 గంట‌ల పాటు ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఆ హింస‌లో క‌నీసం 12 మంది మ‌ర‌ణించారు. ప్ర‌ధాని ఏరియ‌ల్ హెన్రీ రాజీనామా చేయాల‌ని సాయుధ ద‌ళాలు డిమాండ్ చేస్తున్నాయి.

హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌లో ఉన్న ప్రధాన కారాగారంపై సాయుధ ముఠాలు దాడి చేసి ఖైదీలను బయటికి విడుదల చేశాయి. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే ప్రధాన జైలులో ఖైదీల ముఠాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. జైలు గోడలు బద్దలు కొట్టుకొని వందల మంది ఖైదీలు పారిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్‌ యూనియన్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తప్పించుకుని పారిపోయిన వారిలో 2021లో అప్పటి హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోస్‌ను హత్య చేసిన గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లాటిన్ అమెరికాలో అత్యంత పేద దేశమైన హైతీ రాజకీయ అస్థిరతలో ఉంది. అధ్యక్షుడి హత్య తర్వాత ఆ దేశంలో హింస తీవ్రతరమైంది. ప్రధానమంత్రి ఎరియల్ హెన్రీని పదవిలో నుంచి దించి, పోర్ట్ ఓ ప్రిన్స్‌ను 80 శాతం తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఈ సాయుధ ముఠాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి హైతీ ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల ఆ దేశ పర్యటనకు వెళ్లిన సమయంలో పోర్ట్‌ ఆ ప్రిన్స్‌లో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. దాంతో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. అదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ ఆ ప్రిన్స్‌ జైలుపై దాడులు మొదలయ్యాయి.ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు 18 మంది కొలంబియా నేరగాళ్లు కూడా ఉన్నారు.జైలు సామర్థ్యం కేవలం 3,900 కాగా , ఇప్పుడు అందులో 11,778 మంది ఖైదీలు ఉన్నారు. పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లో 80 శాతం ఆ గ్యాంగ్‌ల ఆధీనంలోనే ఉంటుంది.

 

Tags:    
Advertisement

Similar News