పెళ్లికొడుక్కి షాక్ : కళ్యాణ మండపం వద్ద మాజీ ప్రియురాళ్ల నిరసన

ఆ బ్యానర్ చూసిన పెళ్ళికొడుకు బిక్క మొహం వేసి తలదించుకున్నాడు. పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు ఈ విషయమై చెన్ ను నిలదీశారు. చెన్ కి పెళ్లి అయితే జరిగింది కానీ మాజీ లవర్స్ అందరూ కలసి అతడి పరువు తీసి తగిన బుద్ధి చెప్పారు.

Advertisement
Update:2023-02-24 13:13 IST

పెళ్లి కోసం కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండపాన్ని అందంగా అలంకరించారు. ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. చక్కగా ముస్తాబై పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వేదిక వద్దకు వచ్చారు. అప్పుడు జరిగింది పెళ్లి కొడుకు బిత్తర పోయే ఓ సంఘటన. తన కళ్లెదుటే తన మాజీ ప్రియురాళ్లు అందరూ ఒకే చోట కనిపించారు. అది కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తాం.. అని ఓ బ్యానర్ పట్టుకొని.. ఈ తతంగాన్ని చూసిన పెళ్లికూతురు పెళ్లి కొడుకుని నిలదీసింది.

చైనాలోని యున్నన్ ప్రావిన్స్ కు చెందిన చెన్ ఒక ప్లే బాయ్. ఒకరిని ప్రేమిస్తాడు.. ఒప్పుకునే దాకా వెంటపడతాడు.. ఆ తర్వాత కొద్దిరోజులే ప్రేమలో ఉంటాడు. దారుణంగా బ్రేకప్ చెప్పి మరో అమ్మాయితో తిరగడం ప్రారంభిస్తాడు. ఇలా ఎంతోమంది అమ్మాయిలతో చెన్ ప్రేమాయణం నడిపాడు.

ఇదిలా ఉండగా.. చెన్ కి పెళ్లి చేసుకునే టైం వచ్చింది. ఒక కళ్యాణ మండపాన్ని బుక్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్ పెళ్లి కొడుకుగా ముస్తాబై వేదిక వద్దకు వచ్చాడు. పెళ్లికూతురు కూడా వచ్చింది. ఇంకొన్ని క్షణాల్లో పెళ్లి. అప్పుడు వచ్చింది ఓ అమ్మాయిల గ్రూప్. వారంతా చెన్ మాజీ ప్రియురాళ్లు. వారిని చెన్ దారుణంగా మోసగించాడు. అది మనసులో పెట్టుకున్న ప్రియురాళ్లు సరిగ్గా చెన్ పెళ్లి చేసుకుంటుండగా కళ్యాణ మండపం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఒక పెద్ద బ్యానర్ కూడా ప్రదర్శించారు. అందులో ' మేమంతా నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం' అని ఉంది.

ఆ బ్యానర్ చూసిన పెళ్ళికొడుకు బిక్క మొహం వేసి తలదించుకున్నాడు. పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు ఈ విషయమై చెన్ ను నిలదీశారు. చెన్ కి పెళ్లి అయితే జరిగింది కానీ మాజీ లవర్స్ అందరూ కలసి అతడి పరువు తీసి తగిన బుద్ధి చెప్పారు.

మాజీ ప్రియురాళ్లు అందరూ ఒక్కటై పెళ్లి మండపం వద్ద నిరసన వ్యక్తం చేయడంపై చెన్ స్పందించాడు. 'నా మాజీ లవర్స్ చేసిన పనికి నాకేమీ కోపం రాలేదు. గతంలో నేను ఒక బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ ని. ఇది నిజం. అప్పట్లో నాది చిన్న వయసు. తెలిసీ తెలియక చాలామంది అమ్మాయిలను బాధపెట్టా' అని చెప్పాడు. తమను మోసగించిన వ్యక్తికి పెళ్లి జరుగుతున్న సమయంలో అమ్మాయిలందరూ కలిసి పెళ్లి మండపం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మోసగాడికి సరైన బుద్ధి చెప్పారని నెటిజన్లు స్పందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News