నైజీరియాలో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్
మూడు దేశాల పర్యటనలో భాగంగా అబుజా చేరుకున్న భారత ప్రధాని
Advertisement
ప్రధాని నరేంద్రమోదీకి నైజీరియాలో ఘన స్వాగతం లభించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా రాజధాని అబుజాలో అక్కడ స్థిరపడ్డ ప్రవాస భారతీయులు గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పారు. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించినందుకు సంప్రదాయ మరాఠీ నృత్యం లావని ప్రదర్శించారు. వారందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నైజీరియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు అహ్మద్ టినుబుతో సమావేశమవుతారు. సోమవారం జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ కు వెళ్లనున్నారు. మంగళవారం ఆయన గయానాకు చేరుకుంటారు. ఈనెల 21 వరకు ప్రధాని గయానాలో పర్యటిస్తారు. గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో మోదీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేస్తారు.
Advertisement