ప్రపంచకుబేరుల జాబితాలో అదానీని వెనక్కి నెట్టిన అంబానీ
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.
మొన్నటి వరకు దేశంలోని అంబానీనే కాకుండా ప్రపంచంలోని అత్యం ధనవంతులను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానానికి ఎగబాకిన గౌతమ్ అదానీ, హిండెన్ బర్గ్ దెబ్బకు 10వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు.
"దశాబ్దాల కాలంలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు కొనసాగించిందనే విషయం రెండేళ్ల తమ విచారణలో తేలిందనిహిండెన్ బర్గ్ రీసర్చ్ ఆరోపించిన కారణంగా అదానీ షేర్లు దారుణంగా క్షీణించి ఆయన సంపద క్షీణించింది.
కాగా, ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజమైన LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. టెస్లా, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడవ స్థానం, ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ నాలుగవ స్థానం, బెర్క్‌షైర్ హాత్‌వే చీఫ్ వారెన్ బఫెట్ ఐదవ స్థానం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆరవ స్థానం, టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హేలు అండ్ ఫ్యామిలీ ఏడవ స్థానం, గూగుల్ అధినేత లారీ పేజ్ ఎనిమిదవ స్థానంలో, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తొమ్మిదవ స్థానంలో, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ పదవ స్థానంలో కొనసాగుతున్నారు.