కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్
డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ (270) మూడు సీట్ల దూరంలో డొనాల్డ్ ట్రంప్ (267) ఉన్నారు. 538 ఎలక్ట్రోరల్ ఓట్లలో కమలా హారిస్ 224 గెలుచుకున్నారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం సాధించారు.ఈ నేపథ్యంలోడెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
రిపబ్లికన్ పార్టీ నుంచి జాన్‌వేలెన్ 3తో, సారా మెక్ పోటీ పడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలవగా.. వేలెన్‌కు 57.9 శాతం ఓట్లు వచ్చాయి. తాను కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్‌లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.
సారా మెక్ బ్రైడ్ ఎల్‌జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో సుమారు 3 మిలియన్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఒక ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన మొదటి ట్రాన్స్ జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో డెలవేర్‌లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనేటర్‌గా వ్యవహరించారు.