ఇక న్యూయార్క్ స్కూళ్ళ‌లో దీపావళి సెలవులు

అమెరికా, న్యూయార్క్ లో కొన్ని సంవత్సరాలుగా హిందువులు చేస్తున్న పోరాటం ఫలించింది. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లోని పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వాలని నగర మేయర్ నిర్ణయించారు.

Advertisement
Update:2022-10-21 12:27 IST

వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విద్యాసంస్థలకు దీపావళి సెలవులు ఇవ్వాలని న్యూయార్క్ మేయర్ నిర్ణయించారు.

న్యూయార్క్ లో దాదాపు 2 లక్షల మంది హిందువులు ఉంటారని అంచనా. కాబట్టి హిందువులు జరుపుకునే దీపావళి పండుగకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు.

న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెనిఫర్ రాజ్‌కుమార్, న్యూయార్క్ సిటీ స్కూల్స్ ఛాన్సలర్ డేవిడ్ బ్యాంక్స్‌తో కలిసి మేయర్ ఆడమ్స్ మాట్లాడుతూ...

'' దీపావళి సెలవులపై చాలా రోజులుగా నిర్ణయం పెండింగ్‌లో ఉంది. న్యూయార్క్ నగరంలో దాదాపు రెండు లక్షల వరకు భారతీయులు ఉన్నారు. అంత పెద్ద ప్రవాస సమూహం జరుపుకునే దీపావళి పండుగ ప్రత్యేకతను న్యూయార్క్ లోని స్థానికులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది'' అని అన్నారు.

న్యూయార్క్‌లో తొలిసారిగా దీపావళి సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.

పాఠశాలలకు దీపావళి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయం పట్ల న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, మేయర్ ఆడమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కొన్ని సంవత్సరాలుగా, న్యూయార్క్ లో నివసిస్తున్న హిందువులు పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత కాలానికి తమ డిమాండ్ కార్యరూపం దాల్చినందుకు హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు దీపావళికి సెలవు ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News