సీమాంతర ఉగ్రవాదం సత్సంబంధాలను దూరం చేస్తుంది

పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి జైశంకర్‌

Advertisement
Update:2024-10-16 15:30 IST

పాకిస్థాన్‌ గడ్డపై ఆ దేశం తీరును భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఎండగట్టారు. పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండానే ఆ దేశం ఏం చేస్తున్నదో చెప్పేశారు. ఇస్లామాబాద్‌ లో నిర్వహిస్తున్న షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైషన్‌ సమావేశంలో భారత ప్రతినిధిగా హాజరైన జై శంకర్‌ ఇండియా, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణాలేమిటో ఆ దేశం గడ్డ మీది నుంచే వివరించారు. నమ్మకం, పరస్పర సహకారం, స్నేహ సంబంధాలు లోపిస్తే పొరుగువారు దూరమవుతారని తేల్చిచెప్పారు. షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ సమిట్‌ అనంతరం జై శంకర్‌ ట్వీట్‌ చేశారు. దేశ సరిహిద్దుల్లో టెర్రరిజం, వేర్పాటువాద కార్యకలాపాలు ఉంటే ఆ రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, దౌత్యపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజల మధ్య సత్సంబంధాలకు ఆస్కారం ఉండదన్నారు. ఇస్లామాబాద్‌ లో నిర్వహించిన ఎస్‌సీవో సమావేశంలో భారత దేశ వాదనను వినిపించానని ట్వీట్‌ లో వెల్లడించారు. ఈ సవాళ్లపై ఎస్‌సీవో తగిన విధంగా స్పందించాలని కోరారు. ఎస్‌సీవో సమ్మిట్‌ కు వచ్చిన సభ్య దేశాల ప్రతినిధులకు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంగళవారం రాత్రి తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్‌, షెహబాజ్‌ కాసేపు మాట్లాడుకున్నారు. 2015లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్థాన్‌ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పుడు జైశంకర్‌ పాక్‌ పర్యటనకు వెళ్లారు.

Tags:    
Advertisement

Similar News