చంద్రునిపై లూనా-25 కూలిన ప్రాంతమిదే- ఫొటోలు విడుదల చేసిన నాసా

ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. లూనా-25, చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది.

Advertisement
Update:2023-09-01 16:55 IST

చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు భారత్ చంద్రయాన్ - 3 ప్రయోగిస్తుందని తెలియగానే హడావిడిగా ఓ డేట్ ఫిక్స్ చేసుకొని అంతరిక్ష నౌకను ప్రయోగించింది రష్యా. లూనా-25 పేరుతో రష్యా ప్రయోగించిన అంతరిక్ష నౌక మన చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెడుతుంది అనుకున్న భారీ అంచనాలు తలకిందులయ్యాయి. అది రెండు రోజుల ముందే కుప్పకూలింది. దీంతో రష్యా అంతరిక్ష సంస్థ‌ రాస్ కాస్మోస్‌కు నిరాశ తప్పలేదు.


చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో రష్యా అంతరిక్ష నౌక లూనా-25 ఇంజన్ వైఫల్యం ఎదుర్కొంది. ల్యాండింగ్ పాయింట్‌కు ఇంకా కాస్త దూరం ఉండ‌గానే లూనా-25 విఫలమైంది. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. లూనా-25, చంద్రుడిపై బోగుస్లావ్‌స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది. ఆ ప్రయోగం తర్వాత ఈ ప్రాంతాన్ని గుర్తించిన నాసా తాజాగా లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫొటోల‌ను రిలీజ్ చేసింది.




లూనా-25 దిగాల్సిన పాయింట్ స‌మీపంలో ఆ గొయ్యి ఉంద‌ని, అయితే ఆ గొయ్యి లూనా వ‌ల్లే ఏర్ప‌డిన‌ట్లు ఎల్ఆర్వో టీమ్ భావిస్తున్న‌ట్లు నాసా చెప్పింది. మ‌రో వైపు లూనా-25 విఫ‌ల‌మైన అంశంపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ర‌ష్యా ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటు చేసింది.


ఆ తర్వాత రెండు రోజులకే భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ కావడం, దీంతో రష్యా అంతరిక్ష సంస్థ‌ రాస్ కాస్మోస్ తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూడా భారత్ ను అభినందించిన విషయం మనకి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News