అవినీతి క్యాన్సర్ లా విస్తరించింది
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే తీవ్ర వ్యాఖ్యలు
Advertisement
దేశంలో అవినీతి క్యాన్సర్ లా విస్తరించిందని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూచ, అవినీతిని నిర్మూలించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారయంత్రాంగం, రాజకీయ వ్యవస్థలు, సమాజం ఇలా అన్ని చోట్ల అవినీతి విస్తరించిందని తెలిపారు. అసమర్థత, అధికార దుర్వినియోగం ఇతర సమస్యలతో దేశం బాధ పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ నిజాయితీతో పని చేస్తేనే దీనిని పారద్రోలడం సాధ్యమవుతుందన్నారు. అవినీతి, మోసం లేని దేశంగా శ్రీలంకను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు న్యాయవ్యవస్థతో పాటు నేర పరిశోధన విభాగాలు ఎంతో కీలకమన్నారు. ఆ సంస్థలు అంకితభావంతో విధులు నిర్వర్తిస్థాయని నమ్ముతున్నానని అన్నారు.
Advertisement