ఐటీ ఉద్యోగులకు సీఎం క్షమాపణ చెప్పాలి

దావోస్‌లో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం మాట్లాడారు : బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌

Advertisement
Update:2025-01-23 17:43 IST

ఐటీ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం హోదాలో పెట్టుబడులు ఆకర్శించడానికి వెళ్లినప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సింది పోయి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంపద సృష్టిలో కీలకంగా పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను కించపరిచేలా సీఎం మాట్లాడారన్నారు. తెలంగాణను అధోగతి పాలు చేసేలా ఫ్యూడల్‌లా రేవంత్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డికి శ్రమ విలువ తెలియదన్నారు. కేటీఆర్‌ అమెరికాలోని ఒక సంస్థకు మార్కెటింగ్‌ విభాగ అధిపతిగా పని చేశారే తప్ప డీటీపీ ఆపరేటర్‌గా కాదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. పెయింటర్‌ అయిన రేవంత్‌ రెడ్డి ఎంతోమంది శ్రమతో సీఎం అయ్యారని అన్నారు. దావోస్‌లోనే ఉన్న చంద్రబాబు అయినా రేవంత్‌ రెడ్డికి గడ్డిపెట్టాలని సూచించారు. సమావేశంలో నాయకులు తుంగ బాలు, బొమ్మెర రామ్మూర్తి, ఫయాజ్‌, కాంచన పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News