సరిహద్దులో చైనా సైన్యం కవ్వింపు చర్యలు

టిబెట్‌ లో భారీ సైనిక విన్యాసాలు

Advertisement
Update:2025-01-13 12:05 IST

ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టిబెట్‌లోని ఎత్తయిన ప్రదేశంలో భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. మరికొన్ని రోజుల్లోనే ఇండియర్‌ ఆర్మీ ఫౌండేషన్‌ డే ఉంది.. ఈ నేపథ్యంలోనే చైనా కవ్వింపు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. చైనాలోని షింజియాంగ్‌ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్‌ ఈ విన్యాసాలు చేసింది. అత్యాధునిక టెక్నాలజీ, ఆల్‌ టెర్రైన్‌ వెహికల్స్‌, అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌, డ్రోన్స్‌, ఎక్సో స్కెలిటెన్స్‌ లాంటివి ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు. చైనా సైన్యం చర్యలతో ఇండియన్‌ ఆర్మీ అలర్ట్‌ అయ్యింది. డ్రాగన్‌ దేశం అడుగులను నిశితంగా గమనిస్తోంది. 2020లో గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు నిరుడు అక్టోబర్‌ లో కీలక ఒప్పందం చేసుకున్నాయి. చలికాలంలో తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సన్నద్ధమవుతోంది.

Tags:    
Advertisement

Similar News