అక్కడ సీతాకోకచిలుకలు కనుమరుగవుతున్నాయి

బ్రిటన్‌లోని సౌత్ డౌన్స్ నేషనల్ పార్క్ లో ఎప్పుడూ కనిపించే సీతాకోక చిలుకలు ప్రస్తుతం కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రకృతి ప్రేమికులు

Advertisement
Update:2024-09-20 12:10 IST

బ్రిటన్‌ ఒకప్పుడు అరుదైన జాతుల సీతాకోక చిలుకలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి తగ్గిపోయిందని బటర్‌ ఫ్లై సంరక్షణ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలోనూ అవి కనిపించడం లేదని తాజా సర్వే ద్వారా వెల్లడైంది. నిత్యం కనిపించే సీతాకోకచిలుకలు కనుమరుగవడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ డౌన్స్ నేషనల్ పార్క్ లో ఎప్పుడూ కనిపించే సీతాకోక చిలుకలు ప్రస్తుతం కనుమరుగైనట్లు పేర్కొన్నారు. వీటి ఉనికి దేశంలో లక్షకు పైగా సర్వేలు చేయగా.. ఇందులో తొమ్మిది వేల సర్వేలో జీరో సీతాకోకచిలుకల గణాంకాలు నమోదైనట్లు ఆ దేశ సీనియర్‌ సర్వే అధికారి ఒకరు వెల్లడించారు. సర్వే చేసినప్పుడు అటవీ ప్రాంతాల్లో కూడా సీతాకోక చిలుకలు కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే సీతాకోక చిలుకల సగటు 12-7 శాతానికి పడిపోయింది. సుమారు 50 శాతం సీతాకోక చిలుకలు కనుమరుగయ్యాయి.

బ్రిటన్‌లో సీతాకోక చిలుకలు కనిపించకపోవడానికి పంట పొలాలు, ఉద్యానవనాల్లో క్రిమి సంహారక మందులు వినియోగించడమే ప్రధాన కారణం. అందుకే వాటికి తగిన ఆవాసాలు కరువయ్యాయి. కొన్ని ప్రమాదకరమైన క్రిమి సంహారకాలపై పూర్తి నిషేధాన్ని అమలుచేయాలని బటర్‌ ఫ్లై సంరక్షణ సంస్థలు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరాయి. ప్రకృతి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాయి. బ్రిటన్‌లో సీతాకోక చిలుకల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉండటంతో వాటిని సంరక్షించాలని బటర్‌ ఫ్లై కన్జర్వేషన్‌ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.

Tags:    
Advertisement

Similar News