సస్పెన్స్‌కు తెర.. కమలా హారిస్‌కు ఒబామా దంపతుల మద్దతు

అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్‌ పేరును ప్రతిపాదించారు. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు

Advertisement
Update:2024-07-26 16:14 IST

సస్పెన్స్‌ వీడింది. భారత సంతతికి చెందిన‌ అమెరికన్ కమలా హారిస్‌కు ఒబామా దంపతులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కమలా హారిస్‌కు ఫోన్‌ చేసి తమ మద్దతు ప్రకటించారు. హారిస్‌ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. విషయాన్ని బరాక్ ఒబామా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్‌ పేరును ప్రతిపాదించారు. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు లభించింది.


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఎంపికపై తొలుత ఒబామా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఇన్నిరోజులు ఆయన మద్దతు ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె ఓడించలేదని ఒబామా భావించినట్లు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. తాజాగా ఒబామా మద్దతుతో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్‌ అభ్యర్థిత్వానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

Tags:    
Advertisement

Similar News