పార్ల‌మెంటు భ‌వ‌నంలోనే నేను రేప్‌కి గుర‌య్యా..

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ పార్లమెంట్ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-06-15 12:57 IST

ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో దేవాలయంగా పిలిచే పార్ల‌మెంటు భ‌వ‌నంలోనే తాను రేప్‌కి గుర‌య్యాన‌ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మ‌హిళా ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గురువారం జ‌రిగిన సెనేట్ స‌భ‌లో ఆమె మాట్లాడుతూ ఈ ఉద్విగ్న‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ పార్లమెంట్ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

డేవిడ్ వాన్ త‌న‌ను అనుసరించేవారని, అభ్యంతరకరంగా తాకేవారని, శృంగార కార్యకలాపాల కోసం ప్రతిపాదనలు చేసేవారని వివ‌రిస్తూ ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. దీంతో ఆఫీసు గదిలో నుంచి బయటకు రావాలంటేనే భయపడేదాన్నని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డోర్ కొంచెం తెరిచి బయట ఆయన లేరని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్న‌ని వివ‌రించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నాన‌ని చెప్పారు. త‌న‌లాగే ఇంకొందరు కూడా ఇలాంటి వేధింపులు అనుభవిస్తున్నారని త‌న‌కు తెలుస‌ని, వారు కెరీర్ దెబ్బ‌తింటుంద‌నే భ‌యంతో బ‌య‌టికి రావ‌ట్లేద‌ని వివ‌రించారు. ఈ పార్ల‌మెంటు భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదని స్ప‌ష్టం చేశారు.

పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా దీనిపై తాను కేసు పెట్టనున్నట్టు ఆమె తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను డేవిన్ వాన్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. దీనిపై తాను న్యాయపరంగా పోరాడతానని తెలిపారు.

కాగా.. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు చోటుచోసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మహిళ కూడా పార్లమెంట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. 2019 మార్చిలో నాటి రక్షణమంత్రి లిండా రెనాల్డ్ ఆఫీసులో పనిచేసే ఓ సీనియర్ సిబ్బంది.. తనను సమావేశం ఉందని పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో నాటి ప్రధాని స్కాట్ మారిసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News