అమెరికా సెకండ్‌ లేడీ మన తెలుగింటి ఆడబిడ్డ

వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ సతీమణి మన ఉషా చిలుకూరి

Advertisement
Update:2024-11-06 18:26 IST

అగ్రరాజ్యం అమెరికా సెకండ్‌ లేడీ మన తెలుగింటి ఆడబిడ్డే.. అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించగా, వైస్‌ ప్రెసిడెంట్‌ గా జేడీ వాన్స్‌ కు పగ్గాలు అప్పగించనున్నారు. ఆయన సతీమణి ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి. ఒహాయో స్టేట్‌ నుంచి జేడీ వాన్స్‌ సెనెటర్‌ గా ఎన్నికయ్యారు. ఆయనే వైస్‌ ప్రెసిడెంట్‌ అవుతారని గతంలోనే ట్రంప్‌ ప్రకటించారు. కృష్ణా జిల్లా పామూర్రు సమీపంలోని గ్రామానికి చెందిన రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1980లో అమెరికాకు వెళ్లారు. రాధాకృష్ణ ఏరో స్పేస్‌ ఇంజనీర్‌ కాగా, లక్ష్మి మాలిక్యులర్‌ బయాలజీ ప్రొఫెసర్‌. వారి ముగ్గురు పిల్లల్లో ఉషా ఒకరు. ఉషా శాండియాగో ప్రాంతంలో పెరిగారు. యేల్‌ వర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్‌ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్‌ చేశారు. యేల్‌ యూనివర్సిటీ లా అండ్‌ టెక్‌ జర్నల్‌ కు మేనేజింగ్‌ ఎడిటర్‌ గా పని చేస్తున్న సమయంలోనే జేడీ వాన్స్‌ తో పరిచయం ఏర్పడింది. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వారు వివాహం చేసుకున్నారు. జేడీ వాన్స్‌ గెలుపులో ఉషా కీలకంగా పని చేశారు. ఆయనపై వచ్చిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు.

Tags:    
Advertisement

Similar News