అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫస్ట్‌ రిజల్ట్‌ ఇదే!

ఆరు ఓట్లున్న ఊరిలో ట్రంప్‌, హ్యారిస్‌ పోటాపోటీ

Advertisement
Update:2024-11-05 16:57 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగానే ఫస్ట్‌ రిజల్ట్‌ వచ్చేసింది. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. పూర్తి రిజల్ట్‌ రావడానికి ఇంకా ఎదురు చూపులు తప్పవు.. కానీ అమెరికాలోని ఓ కుగ్రామం రిజల్ట్‌ మాత్రం వచ్చేసింది. ఈ రిజల్ట్స్‌ లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ పోటాపోటీగా నిలిచారు. న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌ విల్లే నాచ్‌ గ్రామంలో ఆరుగురు ఓటర్లున్నారు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌ రోజు అర్ధరాత్రి నుంచే ఓటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు బ్యాలెట్‌ పేపర్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఇలా లెక్కించిన ఓట్లలో ట్రంప్‌, హ్యారిస్‌ లకు తలా మూడు ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ వైపు మొగ్గుచూపారు. ఈసారి రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం పోలింగ్‌ సరళి ఇలాగే ఉంటుందా? ఏదో ఒక పార్టీ అభ్యర్థికి స్పష్టమైనా మెజార్టీ ఇస్తారా అనే ఆసక్తి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో నెలకొంది.

Tags:    
Advertisement

Similar News