మాకు భారత్, పాకిస్తాన్ రెండూ కావాలి - స్పష్టం చేసిన అమెరికా
తమకు భారత దేశం, పాకిస్తాన్ రెండూ సమానమే అని అమెరికా స్పష్టం చేసింది. ఆ రెండు దేశాలు వేరు వేరు అంశాల్లో తమకు భాగస్వాములని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.
పాకిస్తాన్ కు అమెరికా తాజాగా ఎఫ్-16 విమానాల విడిభాగాలను అందజేసేందుకు నిర్ణయించడం పట్ల భారత్ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా పాక్ కు 450 మిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలు సరఫరా చేసేందుకు నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తుమని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది కూడా. మరో వైపు అమెరికా, ఎఫ్-16 విమానాలను ఉగ్రవాద వ్యతిరేక దాడుల కోసమే పాక్ ఉపయోగిస్తుందని చెప్పడాన్ని భారత విదేశాంగ శాఖా మంత్రి జయ శంకర్ ఘాటుగా విమర్శించారు. అమెరికా ఎవరిని మోసం చేయాలనుకుంటుందని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు సమానమే అని తేల్చి చెప్పింది. ఆ రెండు దేశాలు వేరు వేరు అంశాల్లో తమకు భాగస్వాములని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. భారత్ తోనూ పాకిస్తాన్ తోనూ, మా మైత్రి దేనికదే ప్రత్యేకం అన్నారాయన. మేము ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ తో మా సంబంధాలను కానీ, భారత్ తో మా సంబంధాలను కానీ చూడలేదు. అంతే కాదు భారత్, పాక్ మధ్య ఉన్న సంబంధాలను కూడా మేము చూడలేదు.'' అని చెప్పారు నెడ్ ప్రైస్