ప్రపంచంలో రైట్ టైమ్ కి వచ్చే విమానం ఏదో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా రైట్ టైమ్ కి విమానాలు నడిపే సంస్థగా ఇండోనేషియాలోని గరుడ సంస్థ రికార్డులకెక్కింది. 95.63 శాతం పర్ఫెక్షన్ తో గరుడ ఇండోనేషియా విమానాలు నడుపుతుంది.

Advertisement
Update:2023-01-12 08:31 IST

విమాన ప్రయాణాలు ఇటీవల కాలంలో ఆలస్యం కావడం పరిపాటిగా మారింది. సిబ్బంది నిర్లక్ష్యం, వాతావరణం అనుకూలించకపోవడం.. కారణాలు ఏవయినా విమానాలు మాత్రం అనుకున్న టైమ్ కి టేకాఫ్ అవ్వడం అన్నిచోట్లా జరగదు. ఇందులో విమానాశ్రయాల లోపం కూడా ఉంటుంది, అదే సమయంలో విమానయాన సంస్థల నిబద్ధత కూడా ఎంతనేది తేలిపోతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రైట్ టైమ్ కి విమానాలు నడిపే సంస్థగా ఇండోనేషియాలోని గరుడ సంస్థ రికార్డులకెక్కింది. 95.63 శాతం పర్ఫెక్షన్ తో గరుడ ఇండోనేషియా విమానాలు నడుపుతుంది. ఎప్పుడో ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ విమానం లేటవుతుంది. గరుడ ఇండోనేషియా తర్వాత దక్షిణాఫ్రికా సంస్థ సఫైర్‌ (95.30 శాతం) రెండో స్థానంలో, జర్మనీ సంస్థ యూరోవింగ్స్‌ (95.26 శాతం) మూడో స్థానంలో నిలిచింది.

విమానాశ్రయాల్లో ఏది నెంబర్-1

జపాన్‌ కు చెందిన ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 91.45 శాతం ఆన్ టైమ్ పర్ఫామెన్స్ (ఓటీపీ)తో అగ్రస్థానం దక్కించుకుంది. ఆయా విమానాలకు కేటాయించిన స్లాట్‌ కు 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపోకలు సాగించడాన్ని పరిగణనలోకి తీసుకుని ఓటీపీ పర్సంటేజ్ ఇస్తుంటారు. జపాన్ విమానాశ్రయంలో విమానాలు మహా అయితే 15 నిమిషాలు మాత్రమే లేట్ అవుతాయి. దాదాపుగా అన్నీ షెడ్యూల్ టైమ్ కే వెళ్లిపోతుంటాయి.

భారత్ సంగతేంటి..?

ఈ ర్యాంకుల్లో భారత్ కూడా చోటు సంపాదించుకుంది. భారత్ నుంచి అత్యథిక ఆన్ టైమ్ పర్ఫామెన్స్ సాధించిన విమానయాన సంస్థ ఇండిగో. ఇండిగో ఓటీపీ 83.51 శాతం. ప్రపంచ వ్యాప్తంగా లెక్క తీస్తే ఇండియో 15వ స్థానంలో నిలిచింది. ఇక విమానాలు ఆలస్యం కాకుండా నడిపే విమానాశ్రయాల్లో టాప్ -20లో కోయంబత్తూర్‌ ఎయిర్‌ పోర్ట్‌ చోటు దక్కించుకోవడం విశేషం. 88.01 శాతం ఓటీపీతో కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ 13వ స్థానంలో నిలిచింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో అత్యంత సమయపాలన ప్రదర్శించిన విమానాశ్రయాల్లో కోయంబత్తూర్‌ ఎయిర్ పోర్ట్ 10వ స్థానంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News