అదానీకి కెన్యా ప్రభుత్వం షాక్‌

ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ సహా, విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో

Advertisement
Update:2024-11-21 20:22 IST

అదానీ గ్రూప్‌నకు కెన్యా ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్‌ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌ సహా, విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా ప్రభుత్వం 736 మిలియన్‌ డాలర్లకు అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది.

మరోవైపు కెన్యాలోని ప్రధాన విమానాశ్రయమైన జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను అదానీకి అప్పగించడానికి రంగం సిద్ధమవగా.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ఈ ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో ప్రకటించారు. రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  

Tags:    
Advertisement

Similar News