మొట్టమొదటి సారి కోర్టులో వాదించనున్న రోబోట్ లాయర్
రోబోట్ లాయర్ వాదనల వల్ల కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన ఈ రోబో న్యాయవాది ఎవరి తరపున, ఏ కేసు వాదిస్తున్నది అన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
మొట్టమొదటి సారి ఓ రోబోట్ లాయర్ కోర్టులో వాదించబోతోంది. వింతగా ఉన్నా ఇది వాస్తవం. అమెరికాలో ఫిబ్రవరిలో ఇది జరగబోతోంది.
రోబోట్ లాయర్ వాదనల వల్ల కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన ఈ రోబో న్యాయవాది ఎవరి తరపున, ఏ కేసు వాదిస్తున్నది అన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ 2015లో కాలిఫోర్నియాలో ‘డునాట్‌పే’ అనే సంస్థను స్థాపించారు. ముద్దాయిల డబ్బును ఆదా చేయడానికి అతను తన యాప్‌ని ఉపయోగించాలనుకుంటున్నారు.
"DoNotPay యాప్ ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్. మీరిప్పుడు ఈ యాప్ ద్వారా కార్పొరేషన్‌లతో పోరాడండి, బ్యూరోక్రసీని ఓడించండి, ఒక బటన్ నొక్కడం ద్వారా ఎవరిపైనైనా దావా వేయండి" అని కంపెనీ పేర్కొంది.
"DoNotPay స్థాపకుడు, CEO అయిన జాషువా బ్రౌడర్, ఈ రోబోట్ లాయర్ కు అనేక రకాల సమస్యలతో కూడిన కేస్ లాపై శిక్షణ ఇవ్వడానికి, యాప్ సత్యానికి కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి చాలా కృషి చేశామని పేర్కొన్నారు.
" చట్టపరమైన లొసుగులను ఉపయోగించుకొని వాస్తవాలను వక్రీకరించడం, కేసును తారుమారు చేయడం మంచిది కాదు. ఈ యాప్ ద్వారా అలాంటివి లేకుండా చూసుకుంటున్నాము." అని అతను చెప్పాడు.