అవినీతిపరులకు థ్యాంక్స్ చెబుతూ కమల్ హాసన్ సెటైర్
భారతీయుడు -2 సినిమాను తాము తీయడానికి స్ఫూర్తినిచ్చిన దేశ రాజకీయాలకు థ్యాంక్స్.. అంటూ ఆయన సెటైర్ వేశారు. దేశంలో పెరుగుతున్న అవినీతిపై కమల్ హాసన్ వేసిన సెటైర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
భారతీయుడు సినిమాలో స్వాతంత్ర సమరయోధుడిగా, అవినీతిపరులను అంతం చేసే పాత్రలో నటుడు కమల్ హాసన్ మెప్పించారు. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా భారతీయుడు -2 అనే సినిమాను కమల్ తీస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుగగా.. అందులో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ.. అవినీతి రాజకీయాలపై సెటైర్లు వేశారు. భారతీయుడు సినిమా విడుదలై 28 సంవత్సరాలు పూర్తయిందని.. అప్పటికీ, ఇప్పటికీ దేశంలో అవినీతి పెరిగింది తప్ప, ఏమాత్రం తగ్గలేదని కమల్ హాసన్ అన్నారు. భారతీయుడు -2 సినిమాను తాము తీయడానికి స్ఫూర్తినిచ్చిన దేశ రాజకీయాలకు థ్యాంక్స్.. అంటూ ఆయన సెటైర్ వేశారు. దేశంలో పెరుగుతున్న అవినీతిపై కమల్ హాసన్ వేసిన సెటైర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ భారతీయుడు సినిమాకు దర్శకత్వం వహించగా.. 1996లో ఆ మూవీ విడుదల అయింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు కూడా శంకరే దర్శకత్వం వహించారు. భారతీయుడు కథ తమిళనాడులో అవినీతి రాజకీయాలు, అవినీతి అధికారుల చుట్టూ నడుస్తుంది. భారతీయుడు -2 అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కీలక పాత్రల్లో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. జూలై 12న భారతీయుడు-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.