పాలు రోజూ తాగొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారు?

పాలను మంచి పోషకాహారంగా చెప్తారు. అయితే పాలు చిన్న వయసులో పని చేసినంత ఎఫెక్టివ్‌గా వయసు పెరిగే కొద్దీ పని చేయవని డాక్టర్లు చెప్తున్నారు.

Advertisement
Update:2024-03-17 20:29 IST

పాలు తాగడం చాలామందికి అలవాటు. నేరుగా లేదా టీ కాఫీల రూపంలో పాలను తీసుకుంటుంటారు. అయితే అసలు పాలు ఆరోగ్యానికి మంచివేనా? వీటితో ఏమైనా నష్టాలున్నాయా? ఏయే సమస్యలున్న వాళ్లు పాలు తాగకూడదు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాలను మంచి పోషకాహారంగా చెప్తారు. అయితే పాలు చిన్న వయసులో పని చేసినంత ఎఫెక్టివ్‌గా వయసు పెరిగే కొద్దీ పని చేయవని డాక్టర్లు చెప్తున్నారు. శరీరం పాలను శోషించుకునే శక్తి చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుందట. పెద్దయ్యే కొద్దీ అది తగ్గుతూ వస్తుందట. అయినప్పటికీ రోజువారీ డైట్‌లో భాగంగా పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పాలలో క్యాల్షియం, ‘ఎ’, ‘బీ2’, ‘బీ12’ విటమిన్లతో పాటు పలు మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక కప్పు పాలలో దాదాపు 150 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫ్యాట్ ఉంటాయి.

పాలలో ఉండే పోషకాల రీత్యా జనరల్ హెల్త్ కోసం పాలు తీసుకోవడం మంచిదే. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పాలకు దూరగా ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాలు అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉన్నవాళ్లకు కూడా పాలకు దూరంగా ఉండాలి. పాలకు ఎలర్జీలను ప్రేరేపించే లక్షణం ఉంటుంది. అల్సర్, లాక్టోస్ ఎలర్జీలు ఉంటే పాలకు దూరంగా ఉండాలి. ఇకపోతే పాలలో ‘బీ12’ విటమిన్ ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్లు పాలు లేదా పెరుగుని రోజూ తీసుకోవడం మంచిది.

పాలు మంచిదని మరీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకి 400 మిల్లీ లీటర్లకు మించి పాలు తాగకూడదు. మాంసాహరం తక్కువగా తినేవాళ్లు పాలు తీసుకుంటే పోషకాహార లోపాలు రాకుండా చూసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News