ఆరుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

ఒకే రోజు బయట పడిన పాజిటివ్‌ కేసులు

Advertisement
Update:2025-01-06 19:38 IST

భారత్‌ లో హెచ్‌ఎంపీవీ మొదటి కేసు బయట పడిన కొన్ని గంటల్లోనే పాజిటివ్‌ ల సంఖ్యకు ఆరుకు పెరిగింది. సోమవారం ఉదయం, మధ్యాహ్నం కర్నాటకలో రెండు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఆ తర్వాత తమిళనాడు రెండు, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఒక్కోక్కరికి వైరస్‌ సోకినట్టుగా నిర్దారణ అయ్యింది. బెంగళూరులో పాజిటివ్‌ గా నిర్దారణ అయిన చిన్నారితో పాటు మరొకరికి ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ హిస్టరీ లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బెంగళూరులో ఇద్దరికి, చెన్నైలో ఇద్దరికి, అహ్మదాబాద్‌ లో ఒకరికి, కోల్‌కతాలో ఒకరికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్‌ విజృంభనతో పెద్ద ఎత్తున ప్రజలు ఆస్పత్రుల్లో చేరారు. దీంతో చైనా ప్రభుత్వం మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. చైనాతో హెచ్‌ఎంపీవీతో కి తోడు కోవిడ్‌ -19, ఇన్‌ఫ్లూయెంజా-ఏ, వైరస్‌ లు న్యూమోనియా వ్యాపిస్తున్నాయి. దేశంలో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డబ్ల్యూహెచ్‌వోతో సంప్రదింపులు జరుపుతోంది.

ప్రజలు ఆందోళన పడొద్దు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా

హెచ్‌ఎంపీవీ వైరస్‌ పాజిటివ్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ వైరస్‌ ను 2001లోనే మొదటిగా గుర్తించారని, దీంతో ప్రజలు హైరానా పడొద్దని సూచించారు. ప్రపంచ మొత్తం ఈ వైరస్‌ ఇదివరకే వ్యాప్తి చెందిందని, గాలి ద్వారా ఇది వ్యాపిస్తుందని తెలిపారు. చలికాలంలో అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతుందన్నారు. చైనాతో పాటు ఇతర దేశాలతో వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్‌ డౌన్‌ పెట్టాల్సిన పరిస్థితి తలెత్తదని తేల్చిచెప్పారు.

Tags:    
Advertisement

Similar News