ఇక బ్లింకిట్‌ అంబులెన్స్‌.. పది నిమిషాల్లోనే ఇంటికి!

బ్లింకిట్‌ యాప్‌లోనే అంబులెన్స్‌ సర్వీసెస్‌ కూడా

Advertisement
Update:2025-01-02 19:22 IST

ఆర్డర్‌ చేసిన పది నిమిషాల్లోనే నిత్యావసరాలు, ఇతర సరుకులను డోర్‌ డెలివరీ చేసే క్విక్‌ ఈ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌ కూడా తీసుకువచ్చింది. తాము సరుకులు పది నిమిషాల్లో డోర్‌ డెలివరీ చేసినట్టుగానే ఆన్‌లైన్‌ లో ఆర్డర్‌ పెట్టిన పది నిమిషాల్లోనే ఇంటికి అంబులెన్స్‌ ను పంపిస్తామని ఆ సంస్థ సీఈవో అల్బిందర్‌ దిండ్సా తెలిపారు. మొదటి దశలో గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌ లను ప్రారంభించామని చెప్పారు. బ్లింకిట్‌ మొబైల్‌ యాప్‌ లోనే అంబులెన్స్‌ రిక్వెస్ట్‌ సర్వీసెస్‌ ను చేర్చామని తెలిపారు. తమ అంబులెన్సుల్లో బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఎక్విప్‌మెంట్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆక్సీజన్‌ సిలిండర్‌, స్ట్రెకచర్‌, సక్షన్‌ ఆపరేటర్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో అంబులెన్స్‌ లో పారా మెడికల్‌ ఎక్స్‌పర్ట్‌, ఒక అసిస్టెంట్‌, డ్రైవర్‌ ఉంటారని తెలిపారు. లాభాలు గడించడం కోసం కాకుండా అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించేందుకే ఈ సర్వీసెస్‌ తీసుకువస్తున్నామని.. రానున్న రెండేళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News