హెచ్‌ఎంపీవీ వైరస్‌.. ఏపీలో నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

ఈ వైరస్‌ సీజనల్‌ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సీఎ ఆదేశం

Advertisement
Update:2025-01-06 21:57 IST

భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్‌ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో ఎలాంటి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కాలేదన్నారు. అక్యూట్‌ రెస్పిటరేటరీ ఇన్ఫెక్షన్‌ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్యూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలసి సీఎం సూచించారు. మైక్రోబయాలజిస్ట్‌లు, పిడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్‌ మెడిస్‌ నిపుణులతో టాస్క్‌పోర్స్‌ కమిటీ నియమించాలని సీఎం ఆదేశించారు.

హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్‌ఫోర్స్‌ నుంచి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ వైరస్‌ సీజనల్‌ వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని సూచించారు. వైరస్‌ టెస్టింగ్‌ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. తక్షణమే 3 వేల టెస్టింగ్‌ కిట్లను తెప్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మందుల లభ్యతలపైనా సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం 4.5 లక్షల ఎన్‌95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్‌ లేయర్డ్‌ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News