హెచ్‌ఎంపీవీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

మంత్రి దామోదర రాజనర్సింహ

Advertisement
Update:2025-01-06 21:02 IST

హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) అనేది కొత్త వైరస్‌ కాదని, 2001లోనే ఈ వైరస్‌ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్‌ పై సోషల్‌ మీడియాలో భయభ్రాంతులకు గురి చేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ వైరస్‌ సోకినా శ్వాసకోస వ్యవస్థపై తక్కువ ప్రభావమే చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వాళ్లు దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఎక్కువగా హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇతర దేశాల్లోని పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్‌ చేసుకుంటున్నామని చెప్పారు. ఈ వైరస్‌ పై ప్రజలు ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉన్నామన్నారు. డిసీజ్‌ సర్వేలైన్స్‌ సిస్టమ్‌ ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించామని, అన్నిరకాల వనరులతో అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News