ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో కంటి క్యాన్సర్‌ గుర్తింపు

ఈ మోడల్‌ డెవలప్‌ చేసిన ఎల్‌వీ ప్రసాద్‌ డాక్టర్లు

Advertisement
Update:2024-12-27 16:43 IST

కంటి క్యాన్సర్లను గుర్తించడానికి హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్లు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో కంటి క్యాన్సర్లను డయాగ్నస్‌ చేయనున్నారు. ఈ ఏఐ ఆధారిత మోడల్‌ ను రెటినోబ్లాస్టోమా అని కూడా పిలుస్తారని డాక్టర్లు వెల్లడించారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ విజిత, అమెరికాకు చెందిన నేత్రవైద్య నిపుణులు డాక్టర్‌ స్వాతి, హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీకి చెందిన డాక్టర్‌ కరోల్‌ ఎల్‌. షీల్డ్స్‌ సంయుక్తంగా ఈ ఏఐ మోడల్‌ ను డెవలప్‌ చేశారు. రెటినోబ్లాస్టోమా అనే ఈ ఏఐ విధానం కంటి క్యాన్సర్లను కచ్చితంగా నిర్దారిస్తుందని తెలిపారు. తాము డెవలప్‌ చేసిన ఏఐ మోడల్‌ 97 శాతం ఖచ్చితత్వంతో కంటిలో క్యాన్సర్లను గుర్తించిందని వారు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News