వాకింగ్ ఇలా చేస్తే బోలెడు బెనిఫిట్స్!

ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రకరకాల అనారోగ్యాలు తగ్గడంతోపాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

Advertisement
Update:2024-07-11 21:57 IST

హెల్దీ లైఫ్‌స్టైల్ కోరుకునేవాళ్లు ప్రతీ రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే వాకింగ్‌లో కూడా బోలెడు వేరియేషన్స్ ఉన్నాయని మీకు తెలుసా? వాకింగ్ ఎలా చేస్తే ఎక్కువ లాభం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రకరకాల అనారోగ్యాలు తగ్గడంతోపాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అయితే సమయం తక్కువగా ఉండేవాళ్లు వాకింగ్‌తో బెటర్ బెనిఫిట్స్ పొందేందుకు ఇలా చేయొచ్చు.

బ్రిస్క్ వాకింగ్

వాకింగ్ మరీ మెల్లగా చేయడం వల్ల లాభం తక్కువగా ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు కొద్దిపాటి స్పీడ్ మెయింటెయిన్ చేయాలి. నడుస్తున్నప్పుడు శరీరమంతా కదిలేలా కాస్తే వేగాన్ని పెంచి నడిస్తే దాన్నే బ్రిస్క్ వాకింగ్ అంటారు. ఈ రకమైన వాకింగ్‌లో నిముషానికి కనీసం 75 నుంచి 100 అడుగులు వేసేలా చూసుకోవాలి.

పవర్ వాకింగ్

వేగంగా నడవలేని వాళ్లు పవర్ వాకింగ్ మెథడ్‌ను అనుసరించొచ్చు. పవర్ వాకింగ్‌లో రెస్ట్ ఇవ్వకూడదు. మెల్లగా నడిచినప్పటికీ మధ్యలో బ్రేక్స్ ఇవ్వకుండా వీలైనంత ఎక్కువ దూరం నడవడానికి ప్రయత్నించాలి. ఈ రకమైన వాకింగ్ వల్ల మెటబాలిజం పెరుగుతుంది. హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది.

హిల్ వాకింగ్

వాకింగ్‌తో మరింత ఎక్కువ బెనిఫిట్ పొందాలనుకుంటే హిల్ వాకింగ్ చేయొచ్చు. అంటే ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతూ నడవడం నడకతోపాటు ఎత్తు కూడా తోడైతే శరీరంపై అదనంగా ఒత్తిడి పడుతుంది. ఇదొక కార్డియో వర్కవుట్‌లా పనిచేస్తుంది. ఎక్కువ క్యాలరీలు కరిగించడానికి ఇది మంచి టెక్నిక్.

రివర్స్ వాకింగ్

వాకింగ్‌లో మరో బెస్ట్ టెక్నిక్ రివర్స్‌ వాకింగ్‌. నార్మల్ వాకింగ్‌తో పోలిస్తే రివర్స్ వాకింగ్‌తో 40 శాతం ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. అంతేకాదు, వెనక్కి నడవడం వల్ల బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కీళ్లు, మెడదు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి.

జాగ్రత్తలు ఇలా..

వాకింగ్‌లో ఉన్న వేరియేషన్స్ అందరికీ ఒకేలా సూట్ అవ్వకపోవచ్చు. అధిక బరువు, గుండె సమస్యలు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా మేరకు గుండె, కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేలా వాకింగ్ చేస్తే మంచిది.

Tags:    
Advertisement

Similar News