కోపం వస్తోందా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి

చాలా మంది కోపంలో తమను తాము నియంత్రణలో ఉంచుకోలేరు. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా నోరు జారుతుంటారు. ఓకేసారి ఇలా విపరీతంగా విరుచుకుప‌డ‌టం అనేది ఒక అనారోగ్య సమస్యే

Advertisement
Update:2022-09-24 16:43 IST

మనిషికి అనేక భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమ, బాధ, సంతోషం, దుఖం, కోపం వంటివి అందరికీ సహజమే. భావోద్వేగాలు లేని మనిషంటూ ఉండడు. కానీ అవి ఏ స్థాయిలో ఉంటాయనే దానిపైనే వారి వ్యక్తిత్వం, వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకుంటేనే ఎవరి లైఫ్ అయినా సాఫీగా సాగిపోతుంది. మనిషిలో ఎన్ని భావోద్వేగాలు ఉన్నా.. కోపం అనే ఫీలింగ్ మాత్రమే ఎదుటి వారిని ఎక్కువగా హర్ట్ చేస్తుంది. దాని వల్ల జీవితంలో అనేక అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది కోపం కారణంగా బంధాలు, బాంధవ్యాలను కూడా తెంచేసుకుంటారు. అప్పటి వరకు ఎంతో కూల్‌గా, డిగ్నిటీతో ఉన్న వ్యక్తి కూడా ఒకే సారి కోపం ప్రదర్శించి నలుగురిలో అభాసుపాలవుతారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, షార్ట్ టెంపర్‌తో ఇష్టానుసారం వ్యవహరించేవారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే భావోద్వేగాలన్నింటిలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఓ రుగ్మత అని డాక్టర్లు చెబుతున్నారు.

చాలా మంది కోపంలో తమను తాము నియంత్రణలో ఉంచుకోలేరు. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా నోరు జారుతుంటారు. ఓకే సారి ఇలా విపరీతంగా విరుచుకుప‌డ‌టం అనేది ఒక అనారోగ్య సమస్యే. కోప్పడే వారికి తలనొప్పి, హైపర్ టెన్షన్ ఎక్కువగా వస్తుంటుంది. వారి గుండె అధికంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం జరుగుతుంది. ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉండే వారిలోనే కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది సహజ లక్షణమే అయినా.. మాటి మాటికీ కోపం ప్రదర్శించేవారిలో 'మోనోమైన్ ఆక్సిడేస్ ఏ' అనే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధకలు తేల్చారు. ప్రతీ వ్యక్తిలోనూ ఈ MAoA ఎంజైమ్ ఉంటుంది. అయితే అది ఉత్పత్తి అయ్యే మోతాదు బట్టి కోపం లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ ఎంజైమ్‌ను ప్రతీ వ్యక్తి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు కొన్ని టిప్స్ పాటించాలని వైద్య నిపుణలు చెబుతున్నారు.

- కోపం ఎక్కువగా వస్తుంది అనుకునే సమయంలో.. ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోవాలి. ఇలా బ్రీత్ తీసుకోవడం వల్ల మజిల్స రిలాక్స్ అవుతాయి. అంతే కాకుండా మన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.

- శారీర‌క‌ వ్యాయామం వల్ల కోపం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తే.. మనం కోప్పడే సందర్భాలు తగ్గుతాయి. అంతే కాకుండా కోపం అమితంగా వచ్చినప్పుడు కాసేపు నడిస్తే రిలాక్స్ అవ్వొచ్చని వైద్యులు చెబుతున్నారు.

- సంగీతం వినడం వల్ల కూడా కోపం తగ్గుతుంది. కోపం వచ్చినప్పుడు మనసుకు నచ్చిన పాటలు, సంగీతం వింటే చాలా వరకు నియంత్రణలో ఉండొచ్చు.

- కోపం వచ్చినప్పుడు పైన చెప్పిన అవకాశాలు లేకపోతే.. మనం ఉన్న చోటనే స్ట్రెచ్చింగ్ ఎక్సర్‌సైజులు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి.. కోపం తగ్గిపోతుంది.

- కుటుంబ సభ్యులతో ఎక్కవ సేపు గడపడం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం వల్ల కోపం తగ్గుతుంది. ఎవరైనా కోపం తెప్పిస్తే.. వారితో కాసేపు మాట్లాడటం మానేసి.. ఆ తర్వాత వారిని చిరునవ్వుతో పలకరిస్తే దాదాపు ఆందోళన తగ్గిపోతుంది.

- డ్యాన్స్ చేయడం, కామెడీ షోలు చూడటం, పుస్తకాలు చదవటం, ధ్యానం వల్ల కూడా కోపం తగ్గుతుంది.

ఇవన్నీ చేసిన తర్వాత కూడా కోపం తగ్గకపోతే తప్పకుండా యాంగర్ మేనేజ్‌మెంట్ కోర్సును పాటించాలి. నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News