కిడ్నీ స్టోన్స్ లక్షణాలివే..

మూత్రపిండాల్లో రాళ్లు చాలా చిన్నగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా పోతుంది.

Advertisement
Update:2024-01-31 09:13 IST

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి మన రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, శరీరం నుంచి చెడుని బయటకు తొలగించడానికి సహాయపడతాయి. అలాంటిది ఆ కిడ్నీలకే సమస్య వస్తే వెంటనే తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. తినే ఆహారం, జీవనశైలి, కొన్ని వ్యాధుల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే ఈ సమస్యకి వయసుతో సంబంధం లేదు. నిజానికి ఇవి ఏర్పడిన వెంటనే చాలా చిన్న సైజులో ఉంటాయి. వాటి పరిమాణం పెరిగే కొద్దీ ఆరోగ్యం దిగజారుతుంది. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లు చాలా చిన్నగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా పోతుంది. అసలు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా అంటే..


మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడ్డాయని తెలియజేసే ప్రధాన లక్షణాలలో ఒకటి వెనుక వైపు నొప్పి. ఈ నొప్పి నడుం నుంచి బాధాకరంగా ఉంటుంది. పొత్తికడుపు, గజ్జ ప్రాంతం వరకు కూడా వ్యాపిస్తుంది. అలాగే రెండవది మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా లేదా మంట, మూత్రం రంగు కూడా మారుతుంది. రక్తంతో కలిసి గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో వస్తుంది. ఈ లక్షణాన్ని హెమటూరియా అని కూడా అంటారు. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి వికారం, వాంతులు ఉండటం సాధారణం. మూత్రపిండాలు, GI ట్రాక్ట్ మధ్య నరాల కనెక్షన్ల కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఆకస్మికంగా జ్వరం వచ్చి పోతుంది. జ్వరంతో పాటు చలి, వణుకు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.

ఏమి తినాలి..? ఏమి తినకూడదు

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఫ్యాక్ట్ ఫుడ్, టొమాటో జ్యూస్, చైనీస్ ఫుడ్స్ జోలికి పోకూడదు. శరీరంలో డీహైడ్రేషన్‌కు కెఫిన్ ఒక కారణం. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కాఫీ,టీలు ఎక్కువగా తీసుకోరాదు. శీతల పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెంచుతుంది. కాబట్టి వాటినీ నివారించాలి. ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. యాపిల్స్, ద్రాక్ష వంటి పళ్ళు ,ఆకుకూరలు అధికంగా తినాలి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఆక్సలేట్, విటమిన్ సి ఉన్నఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. చాక్లెట్, టొమాటో, బచ్చలికూర, తృణధాన్యాలు , ఉసిరి, సోయాబీన్, పార్స్లీ, సపోటా, గుమ్మడికాయ, శెనగలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు  ఉంటాయి.


Tags:    
Advertisement

Similar News