గురకకు చెక్ పెట్టండిలా..

నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది చాలామందికి. గురక వల్ల నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది.

Advertisement
Update:2023-07-14 06:30 IST

నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది చాలామందికి. గురక వల్ల నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక తగ్గించుకునేందకు మార్గాలు ఉన్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం.

శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకుల వల్ల నిద్రలో శ్వాస సరిగా అందక గురక వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో గురకకు చెక్ పెట్టొచ్చు.

దాల్చిన చెక్కను పొడి చేసి అందులో కాస్త తేనె కలుపుకుని రోజూ తీసుకోవడం ద్వారా గురకకు చెక్ పెట్టొచ్చు.

టీస్పూన్ యాలకుల పొడిని ఒక గ్లాసు కాచిన నీటిలో కలిపి రోజూ పడుకునేముందు తీసుకుంటే గురక సమస్యను తగ్గించుకోవచ్చు.

గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగినా శ్వాస నాళాలు క్లియర్ అయ్యి, గురక తగ్గుతుంది.

ఇకపోతే వెల్లకిలా పడుకోవడం వల్ల గురక తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కుడివైపుకో, ఎడమవైపుకో పడుకుంటే కొంతవరకూ గురకను తగ్గించొచ్చు. ఎక్కువ బరువు ఉన్నవాళ్లకు గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గితే గురక సమస్య కూడా తగ్గుతుంది.

గురక తగ్గించడం కోసం ప్రాణాయామం, బాక్స్ బ్రీతింగ్ లాంటి శ్వాస వ్యాయామాలు పనికొస్తాయి. లంగ్ కెపాసిటీని పెంచుకోవడం, కార్డియో చేయడం ద్వారా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తద్వారా గురకను కూడా కంట్రోల్ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News