బరువు తగ్గడం కోసం భోజనం మానేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఈ రోజుల్లో టైం టు టైం మీల్స్ తినేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. చాలామంది మీల్ రీప్లేస్‌మెంట్‌కు మొగ్గు చూపుతున్నారు.
రానురానూ ఫుడ్ హ్యాబిట్స్‌లో ఎన్నో మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా సిటీ లైఫ్‌లో రోజుకో కొత్త డైట్ పుట్టుకొస్తుంది. అధిక బరువు, డయాబెటిస్ ఉన్న చాలామంది ఈమధ్య మీల్ రీప్లేస్‌మెంట్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అంటే భోజనాన్ని మానేసి దానికి బదులు షేక్స్, ఫుడ్ సప్లిమెంట్స్‌తో పొట్ట నింపుకోవడం. అసలు ఇది ఎంతవరకూ కరెక్టో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో టైం టు టైం మీల్స్ తినేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. చాలామంది మీల్ రీప్లేస్‌మెంట్‌కు మొగ్గు చూపుతున్నారు. బిజీ లైఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమింగ్స్‌లో ఏదో ఒకటి పొట్టలో పడేస్తే చాలని కొందరు అనుకుంటుంటే.. మరికొంత మంది వెయిట్ లాస్ కోసమని ప్రొటీన్ షేక్స్, ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు. అయితే ఇలా భోజనాన్ని మానేయడం వల్ల చాలానే నష్టాలుంటాయంటున్నారు డాక్టర్లు. అవేంటంటే..
నష్టాలివే..
పూర్తిగా భోజనం మానేయడం ద్వారా శరీరానికి కావల్సిన పూర్తి పోషకాలు అందకపోగా లాంగ్ టర్మ్‌లో ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో దొరికే మీల్ రీప్లేస్‌మెంట్ ప్రొడక్ట్స్, షేక్స్, పౌడర్స్ వంటివి తీసుకోవడం వల్ల ఆకలి మందగించడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ వంటివి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు, మీల్ రీప్లేస్‌మెంట్స్‌లో ఉండే హై ప్రొటీన్స్ జీర్ణ సమస్యలకు కారణం అవ్వొచ్చు. మీల్ రీప్లేస్‌మెంట్స్ తో బరువు తగ్గుతారన్న గ్యారంటీ లేదు. కానీ, ఈ తరహా ఫుడ్స్ తీసుకోవడం ఆపేయగానే కోల్పోయిన బరువు పెరగడం ఖాయం. అందుకే రిస్క్ తీసుకోకుండా సమతుల్యమైన రీతిలో పౌష్టికాహారం తీసుకోవడం అన్ని విధాల మేలు అనేది డాక్టర్ల సలహా.
ఇలా చేస్తే బెటర్
వెయిట్ లాస్ కోసం డాక్టర్ల సూచనలకు మేరకు మాత్రమే మీల్ రీప్లేస్‌మెంట్స్ వాడాలి. రోజుకు ఒక మీల్‌ను మాత్రమే రీప్లేస్ చేయాలి. అది కూడా పౌడర్స్, షేక్స్‌కు బదులు ఓట్ మీల్స్, రోటీల వంటివి తీసుకుంటే మంచిది.
మిల్లెట్స్‌లో హై ఫైబర్ ఉంటుంది. కాబట్టి అవి నేచురల్ మీల్ రీప్లేస్‌మెంట్స్‌గా పనిచేస్తాయి. రాగి జావ, జొన్న జావ వంటివి తీసుకోవచ్చు.
ఇకపోతే వ్యాయామం చేయడం, స్నాక్స్ మానేయడం, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినడం వంటి అలవాట్లు కూడా వెయిట్‌లాస్‌కు హెల్ప్ అవుతాయి.