అర్ధరాత్రి దాటాక పడుకుంటే అర్ధాయుష్షు .. జాగ్రత్త మరి ..

తక్కువగా నిద్రపోవటం శారీరక, మానసిక సమస్యలను పెంచి.. దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. రోజులో ప్రతి రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే..మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది, బరువు పెరుగుతుంది, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని చెబుతారు.

Advertisement
Update:2024-05-20 20:09 IST

మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాత్రి త్వరగా నిద్రపోయి, తెల్లవారుజామునే నిద్రలేవాలని. అయితే, ఇప్పుడు మనలో చాలామంది దీనికి రివర్స్‌ ఫాలో అవుతూ ఉంటారు. శ‌రీరానికి ఆహారం, ఊపిరి ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా అంతే ముఖ్యం.కానీ, బిజీ లైఫ్, సోషల్ మీడియా నిద్రను దూరంచేస్తుంది.

ముఖ్యంగా సోషల్​మీడియా​ ప్రభావం ఎంతగా ఉంది అంటే నిద్ర వచ్చేవరకు మొబైల్ చూద్దాం అని మొదలు పెట్టి చివరికి నిద్రపోవడాన్ని కూడా వదిలేసి దానిలోనే మునిగిపోతున్నాం. సినిమాలు, వెబ్ సిరీస్​లు, వీటన్నింటికన్నా ముఖ్యంగా రీల్స్, మీమ్స్​కి బాగా అలవాటైపోయి.. శరీరానికి అత్యంత అవసరమైన నిద్రని కోల్పోతున్నాం. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం వల్ల మన ‘జీవ గడియారంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు.

 

తక్కువగా నిద్రపోవటం శారీరక, మానసిక సమస్యలను పెంచి.. దీర్ఘకాలిక ప్రమాదాలను పెంచుతుంది. రోజులో ప్రతి రాత్రి నిద్ర 7 నుంచి 8 గంటలు లేకపోతే..మానసిక స్థితిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది, బరువు పెరుగుతుంది, ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయని చెబుతారు. అంతే కాదు ఆ ఎఫెక్ట్ పగలు చేయాల్సిన పనిపై పడుతుంది. దీనితోపాటూ దృష్టిలోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, చురుకుగా లేకపోవడం వంటి సమస్యలూ మొదలవుతాయి.

జీవక్రియ నెమ్మదించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కూడా జరుగుతుంది. ఇలా చాలా మమ్ములుగా ప్రారంభమైన సమస్యలు మెల్లిగా దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. నిజానికి రాత్రి నిద్ర అంటే ఇంకాస్త రాత్రి మిగిలి ఉండగానే పడుకొని ఉదయం వరకు పడుకోవాలని కాకుండా.. రాత్రి త్వరగా పడుకుని.. తెల్లవారుజామునే నిద్రలేచేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే శరీరానికి ఆరోగ్యం, మనసుకి ఆహ్లాదం కూడా.

Tags:    
Advertisement

Similar News