క్రియేటివిటీని ఇలా పెంచుకోవచ్చు!
ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌లో క్రియేటివ్‌గా ఉండడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.
ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్‌లో క్రియేటివ్‌గా ఉండడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. క్రియేటివిటీతో రకరకాల ప్రాబ్లమ్స్‌కు సింపుల్ సొల్యూషన్స్ కనిపెట్టొచ్చు. కొన్ని సింపుల్ టెక్నిక్స్‌తో క్రియేటివిటినీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
క్రియేటివిటీని పెంచుకోవడం కోసం రిస్క్ తీసుకోవడం తప్పనిసరి. రిస్క్ తీసుకున్నప్పుడు దాన్ని ఫేస్ చేసేందుకు ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది క్రియేటివిటీకి పదును పెడుతుంది.
బుక్ రీడింగ్ వల్ల కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివ్‌గా ఆలోచించాలంటే.. ఎక్కువ విషయాలపై నాలెడ్జ్ ఉండాలి. దీనికోసం బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవచ్చు.
మెదడు క్రియేటివ్‌గా ఆలోచించాలంటే స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి ఉండకూడదు. దానికోసం రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. వీటితో పాటు యాక్టివ్‌గా ఉండడం, ఆటలు ఆడడం, మనసుకి నచ్చిన పనులు చేయడం ద్వారా కూడా క్రియేటివిటీని పెంచుకోవచ్చు.
అలాగే రోజులో కొంత సమయం రిలాక్స్ అవ్వడం కోసం కేటాయించాలి. ప్రశాంతంగా గడపడాన్ని అలవాటు చేసుకుంటే మెదడు మరింత క్రియేటివ్‌గా ఆలోచించగలదు.
మన ఐడియాలు ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. మీ ఐడియాస్‌ను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ద్వారా ఐడియాలు మరింత పదునుగా ఉండే అవకాశం ఉంటుంది.