గుండెపోటుని తగ్గించే వంటింటి ఔషదాలు!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె జబ్బుల బారినపడుతున్నారు.

Advertisement
Update:2023-06-18 16:47 IST

గుండెపోటుని తగ్గించే వంటింటి ఔషదాలు!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె జబ్బుల బారినపడుతున్నారు. ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో కూలిపోతున్నారు. అయితే తరచుగా గుండెపోటు వచ్చే వాళ్లకు వంటింట్లో ఉండే కొన్ని ఔషదాలు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. హార్ట్‌లో తరచుగాఏర్పడే బ్లాక్‌లను డైట్ ద్వారా తగ్గించుకోవచ్చని అంటున్నారు. అదెలాగంటే..

గుండెపోటుని తగ్గించడానికి వంటింట్లో ఉండే అల్లం మంచి మెడిసిన్‌గా పని చేస్తుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. దాంతో రక్తపోటు తగ్గే వీలుంటుంది. ఇది నేచురల్ గా గుండెపోటు సమస్యను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

వెల్లుల్లి రసంలో ఉండే ‘అల్లిసిన్‌’ అనే కాంపౌండ్.. కొలస్ట్రాల్‌ని, బీపీని ఎఫెక్టివ్‌గా తగ్గించగలదు. దీంతో హార్ట్‌ బ్లాక్స్ సమస్య తగ్గుతుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవాళ్లు వెల్లుల్లిని డైట్‌లో తప్పక చేర్చుకోవాలి.

ఇకపోతే రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌– సీ, పొటాషియం రక్తాన్ని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతాయి. దాంతో గుండెపోటు, రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా రక్తనాళాలు తెరుచుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News