నరాల వీక్‌నెస్‌కు చెక్ పెట్టండిలా..
సాధారణంగా వయసుపైబడిన వాళ్లలో నరాల బలహీనత, చేతులు, కాళ్లు వణకడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చిన్నవయసులోనే నరాల వీక్‌నెస్ మొదలవుతుంది.
సాధారణంగా వయసుపైబడిన వాళ్లలో నరాల బలహీనత, చేతులు, కాళ్లు వణకడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చిన్నవయసులోనే నరాల వీక్‌నెస్ మొదలవుతుంది. నరాల వీక్‌నెస్‌కు తగ్గించుకోకపోతే రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నరాల వీక్‌నెస్‌కు ఆల్కహాల్ ఎక్కువగా కారణమవుతుంది. కాబట్టి వణుకు, తిమ్మిర్లు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డ్రింకింగ్ అలవాటును మానుకోవాలి. అలాగే కాఫీ, కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు కూడా దూరంగా ఉండాలి.
నరాల బలహీనంగా తయావడానికి పోషకాల లోపం కూడా కారణమవ్వొచ్చు. ముఖ్యంగా బీ కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తే నరాలు పట్టు కోల్పోతాయి. అందుకే బీ కాంప్లెక్స్ విటమిన్లు కోసం పొట్టు తీయని గింజధాన్యాలు, బ్రౌన్ రైస్, గోధుమలు ఎక్కువగా తినాలి.
రొజూవారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే పోషకాల లోపాన్ని సరిచేయొచ్చు. వీలైనన్ని ఎక్కువరకాల కూరగాయలు తీసుకుంటే అన్నిరకాల విటమిన్లు తగిన మోతాదులో లభిస్తాయి.
నరాల వీక్‌నెస్ ఉన్నవాళ్లు డి విటమిన్ కోసం ఉదయం లేదా సాయంత్రపు ఎండలో కాసేపు నడవాలి.
బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు, కందులు, మినుములు లాంటి వాటిని వీలైనంతవరకు పొట్టు తీయకుండానే పిండి చేసుకుని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల వీక్‌నెస్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.
నరాల వీక్‌నెస్ ఉన్నవాళ్లు రోజువారీ వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి. ముఖ్యంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగా లాంటివి చేస్తే నరాలు బలంగా తయారవుతాయి.
నరాల వీక్‌నెస్‌కు మానసిక ఆరోగ్యానికి లింక్ ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నరాలకు సరైన ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అందుకే మెదడు ఆరోగ్యం కోసం ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ ఎంచుకోవాలి.