కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..
రాత్రి పుట గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కాలి పిక్క పట్టేసి కదలలేనంత స్టిఫ్‌గా మారి భరించలేనంత నొప్పి పెట్టడాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీకే కాదు చాలా మందికి లో ఇలా తరచుగా జరుగుతుంది.
రాత్రి పుట గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కాలి పిక్క పట్టేసి కదలలేనంత స్టిఫ్‌గా మారి భరించలేనంత నొప్పి పెట్టడాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీకే కాదు చాలా మందికి లో ఇలా తరచుగా జరుగుతుంది. అయితే ఒక్కోసారి పాదాల్లో , తొడల్లోనూ ఈ విధంగా కండరాలు పట్టేస్తుంటాయి.
అలాంటి పరిస్తితి ఎదుర్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కష్టం. ఫలితంగా ఆయా భాగాల్లోనూ భయంకరమైన నొప్పి కలుగుతుంది. కండరాలు పట్టేసినప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలయితే కొన్ని సార్లు వంకర పోయినట్లు అవుతాయి. ఒక్కోసారి కాలి వేళ్లకూ ఇలా జరుగుతుంది. ఫలితంగా అవి కూడా వంకరగా మారినట్లు అనిపిస్తుంది. అదే పిక్కల్లో అయితే కాలు అలా వంగకుండా , కదలకుండా ఉండిపోతుంది. నొప్పితో విలవిలాలాడిపోతారు.
సహజంగా కండరాలు పట్టేసినప్పుడు ఆ నొప్పి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం దానికదే తగ్గిపోతుంది. కొందరికి ఈ సమస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ కొందరికి పదే పదే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. 60 ఏళ్లు పైబడిన వారికి సహజంగానే ఈ విధమైన నొప్పి వస్తుంటుంది. కానీ ఇతర వయస్సుల వారికి కూడా పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. డీహైడ్రేషన్, అలసట, రక్త ప్రసరణలో లోపం, ఇప్పటికే వాడుతున్న మందులు, పోషకాహార లోపం కూడా దీనికి కారణం కావచ్చు.
రోజూ కనీసం 30 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా పొటాషియం, మెగ్నిషియం లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి లోపించినప్పుడు కండరాలు ఈ విధంగా పట్టేస్తుంటాయి. అలాగే హైడ్రేటెడ్ గా ఉండండి. రోజంతా పుష్కలంగా నీళ్ల తీసుకోవాలి. మీ కాలి పిక్క కండరాలను క్రమం తప్పకుండా సాగదీయండి. ఇది వాటి ఫ్లెక్సిబులిటీని మెరుగుపరచడానికి, దృఢంగా మారే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. బిగుతుగా లేదా ఎత్తుగా షూ మీ కాలి కండరాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
నొప్పి వచ్చినప్పుడు మీ కాలి పిక్క కండరాలను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వాటికి ఉపశమనం లభిస్తుంది. ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్‌ను నొప్పి ఉన్న ప్రాంతంలో కాసేపు ఉంచండి మంచి ఫలితం ఉంటుంది.